'ఛాంపియన్' నుంచి నయా UPDATE

'ఛాంపియన్' నుంచి నయా UPDATE

సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్'. ఈ మూవీలో నటి అనశ్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. ఆమె చంద్రకళ పాత్రలో కనిపించనుంది. పెద్ద కలలు కంటూ నాటక కళాకారిణిగా ఎదగాలనుకునే పల్లెటూరి అమ్మాయిగా.. ధైర్యసాహసాలు ఉన్న యువతిగా ఆమె కనిపించనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి.  ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు.