మంగళగిరిలో మృతదేహం లభ్యం

GNTR: మంగళగిరి పరిధిలో బుధవారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నగర పరిధిలోని తెనాలి రోడ్డు గుంటూరు ఛానల్ వద్ద సుమారు 35 నుంచి 40ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి శవాగారానికి తరలించినట్లు తెలిపారు.