హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక వాయిదా
అన్నమయ్య: మదనపల్లెలోని స్థానిక బీటీ కాలేజీలో నేడు జరగాల్సిన అండర్-14-17 బాల బాలికల హ్యాండ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక వాయిదా పడింది. ఈ విషయాన్ని SGF జిల్లా కార్యదర్శిలు నాగరాజు, ఝాన్సీ రాణి బుధవారం తెలిపారు. అధిక వర్షం కారణంగా వాయిదా వేసినట్లు చెప్పారు.తదుపరి తేదిని ప్రకటిస్తామన్నారు.