అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు
VKB: కుల్కచర్ల నుంచి పరిగి వెళ్తున్న ఓ కారు మోత్కూర్ గేట్ సమీపంలో ఆదివారం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతినగా ప్రయాణికుల పరిస్థితి గురించి స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలిస్తున్నారు.