తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: మంత్రి

తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తాగునీటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. అవసరమైతే నీటి వసతి లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా శుభ్రమైన మంచినీటిని అందించాలన్నారు.