మోడల్ స్కూల్‌ను పరిశీలించిన కలెక్టర్
JGL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నారు. పాఠశాలను పూర్తిగా సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు.