సంజయ్ కాంగ్రెస్ వీడనున్నారా?

సంజయ్ కాంగ్రెస్ వీడనున్నారా?

NZB: జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్ తగలనుంది. నగరానికి చెందిన సీనియర్ నేత ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాటలోనే ధర్మపురి సంజయ్ త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. బీసీలకు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందని అసహనంతో ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందింది.