VIDEO: ఆగి ఉన్న లారీ ఢీ కొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: ఆగి ఉన్న లారీ ఢీ కొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

BHPL: జిల్లా కేంద్రంలోని చెల్పూర్ సమీపంలో నిన్న అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చి బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి వాహనదారులు గాయపడిన ఆయనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.