జీహెచ్ఎంసీ ఉద్యోగుల పిల్లల కోసం స్పెషల్ సెంటర్

HYD: ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల చిన్నారుల కోసం ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేశారు. కార్యాలయ ప్రాంగణంలోనే పిల్లలు భద్రంగా ఉండేందుకు, ఆడుకోవడానికి అవకాశం కల్పిస్తూనే అక్కడే వారిని పర్యవేక్షిస్తారు. ఉద్యోగులు డ్యూటీకి వచ్చిన సమయం నుంచి వెళ్లే వరకు వారి పిల్లలను ఈ సెంటర్లోనే ఉంచుతారు.