అద్దె వాహనాల ఏర్పాట్లు కోసం టెండర్లకు ఆహ్వానం
BDK: సింగరేణి ఇల్లందు ఏరియాలో 2 అద్దె వాహనాల ఏర్పాటు కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఏరియా జీఎం కృష్ణయ్య శుక్రవారం ప్రకటించారు. జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్ విభాగంలో రూ. 590 చెల్లించి, ఈ నెల 24 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.