యాదవ కల్యాణ మండపానికి మంత్రి హామీ

యాదవ కల్యాణ మండపానికి మంత్రి హామీ

SS: గోరంట్లలో యాదవ కల్యాణ మండపం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ మండల యాదవ కులస్తులు మంత్రి సవితను పెనుకొండలో కలిశారు. వారి అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులతో చర్చించి స్థల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నిర్మాణానికి నిధుల కోసం ఎంపీ బీకే పార్థసారథికి సిఫారసు లేఖను కూడా అందించిరనట్లు ఆమె తెలిపారు.