మోసం కేసులో డ్రైవర్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష
E.G: డ్రైవర్‌గా పని చేస్తూ యజమానిని మోసం చేసిన కేసులో నీలం శివానందానికి రాజమండ్రి 3వ అదనపు మెజిస్ట్రేట్ సి.రమ్య మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.3000 జరిమానా విధించారు. కార్లు, బంగారం, నగదు, పత్రాలను తన ఆధీనంలోకి తీసుకుని ఫైనాన్స్ పొందినట్లు తేలింది. పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయగా కోర్టు శిక్ష విధించింది.