శింబు సినిమాలో విజయ్ సేతుపతి
తమిళ హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'అరసన్'(తెలుగులో సామ్రాజ్యం). తాజాగా ఈ సినిమాలో నటుడు విజయ్ సేతుపతి భాగమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో విలన్‌గా ఆయన కనిపించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.