VIDEO: ఉప్పలూరులో ఘనంగా జ్యోతుల మహోత్సవం

KDP: ముద్దనూరు మండలం ఉప్పలూరులో జ్యోతుల ఉత్సవాలను తోగటవీర క్షత్రియులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మొక్కు చెల్లించేవారు జ్యోతిని తయారుచేసి దానిని తలపై ఉంచి వారి బృందంతో లయబద్ధంగా నృత్యం చేస్తూ.. భక్తిగీతాలు ఆలపిస్తూ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆదివారం వేకువజామునుంచి నుంచి ఉదయం 8 గంటల వరకూ జ్యోతి ఉత్సవం కొనసాగింది.