VIDEO: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు

VIDEO: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు

MLG: మంగపేట మండలం కమలాపురం-గంపొనీగూడెం మధ్య రోడ్డుపై శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.