పందిపర్తిలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం

పందిపర్తిలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం

సత్యసాయి: సోమందేపల్లి మండలం పందిపర్తి పంచాయతీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు, రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల నిధులు వారి ఖాతాల్లో జమ అయిన విషయాన్ని టీడీపీ నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి, యానిమేటర్ స్వాతి, డీలర్ గౌరి, తదితరులు పాల్గొన్నారు.