తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు

తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు

CTR: తిరుమలలో కేంద్రీకృత టీటీడీ పరిపాలనా భవన నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ భగీచా బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆకాశగంగ ప్రాంతానికి వెళ్లి అక్కడి దుకాణాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.