రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
SDPT: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన కుకునూర్ పల్లి మండలలోని రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. మద్దూర్ మండలం గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన పవన్ (25) బైక్ పై హైదరాబాద్‌కి వెళ్తుండగా మార్గమధ్యలో కుకునూర్ పల్లి గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చేట్ల పోదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ పైన ఉన్న పవన్ తలకు తీవ్ర గాయలై మృతి చెందాడు.