ఆలయ భూముల ఆక్రమణపై సీపీఐ ఉద్యమం
SRPT: దేవాలయ భూముల అన్యాక్రాంతంపై సీపీఐ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని కోదాడ ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న తమరబండపాలెం బాలాజీ దేవాలయ భూమిలో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్న స్థలాన్ని మీడియా ముందు పరిశీలించి విలేకరులతో మాట్లాడారు.