రైతుల బాధలు వినడానికి మీటింగ్ పెట్టుకున్నాం: హరీష్ రావు
HYD: పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని ఆరెస్ట్ చేసి మూడు పీఎస్‌లకు తీసుకెళ్లారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వారు మాట్లాడుతూ.. మేము ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పరిగి నియోజకవర్గం కడ్లాపూర్ గ్రామంలో రైతుల బాధలు వినడానికి మీటింగ్ పెట్టుకున్నామని, అక్కడికి పోలీసులు వెళ్లి రైతులని ఆరెస్ట్ చేసి బెదిరిస్తున్నారని టెంటును కూల్చేశారని పేర్కొన్నారు.