VIDEO: అద్దంకిలో రంజాన్ ప్రార్థనలు
BPT: అద్దంకిలో రంజాన్ వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మసీదుల వద్ద రంజాన్ సందడి నెలకొంది. సింగరకొండ రోడ్డులోని ఈద్గావద్ద పెద్ద ఎత్తున ముస్లింలు నమాజ్ చేశారు. నెల రోజులు నియమాలతో ఉపవాసాల పూర్తి చేసుకొని రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.