ఫంక్షన్ హాల్ ప్రారంభించిన మంత్రి సీతక్క
JN: పాలకుర్తి మండల కేంద్రంలో రూ.47 లక్షలతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనే మహిళలకు పెద్దపీట లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో MLA యశస్విని రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.