నా గెలుపునకు కారణం మైనార్టీలే: రేవంత్
TG: కొడంగల్‌లో తాను మూడు సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఉందని CM రేవంత్ అన్నారు. '20 నెలల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు అండగా ఉన్నాం. కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలు అంటే కాంగ్రెస్. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్‌రెడ్డి అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వొద్దో చెప్పాలి. మోదీ, KCR ఒక్కటే. BRS ముస్లింలను మోసం చేస్తోంది' అని పేర్కొన్నారు.