పాత నేరస్థుడు అరెస్ట్.. ఏడాదిపాటు బైండోవర్

పాత నేరస్థుడు అరెస్ట్.. ఏడాదిపాటు బైండోవర్

కృష్ణ: చాట్రాయి మండల తహసిల్దార్ ఎదుట ఎక్సైజ్ నేరాలకు పాల్పడిన పాత నేరస్థుడు కటారి జయరాజును సోమవారం బైండోవర్ చేసినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మస్తానయ్య మాట్లాడుతూ.. బైండోవర్ ఏడాది కాలం పాటు ఉంటుందని అన్నారు. ఈ సమయంలో నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించటం జరుగుతుందన్నారు.