VIDEO: సిద్ధిరామేశ్వరలయంలో ప్రత్యేక పూజలు
KMR: బిక్కనూర్ శివారులోని దక్షిణ కాశీగా పిలవబడే సిద్ధిరామేశ్వర ఆలయంలో శనివారం కార్తీక మాస సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలను నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పద్మ శ్రీధర్ చెప్పారు.