యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే

TPT: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణం అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పట్టణ ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.