నోడల్ అధికారులదే బాధ్యత: కమిషనర్

నోడల్ అధికారులదే బాధ్యత: కమిషనర్

కర్నూలులోని 137 సచివాలయాల పనితీరుపై నోడల్, సహాయ నోడల్ అధికారులకే పూర్తి బాధ్యత ఉందని కమిషనర్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. వారంలో కనీసం 10 సచివాలయాలను తనిఖీ చేసి, నివేదికలు సమర్పించాలన్నారు. ప్రస్తుతం 14 రకాల సేవలు అందిస్తున్న సచివాలయాల్లో ఏ నిర్లక్ష్యం జరిగినా సంబంధిత అధికారులపైనే బాధ్యత ఉంటుందన్నారు. ఏడుగురు ప్రత్యేక కార్యదర్శులను నియమించామన్నారు.