విజయ్ కొత్త మూవీపై నయా UPDATE
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రవికిరణ్ కోలా కాంబోలో 'రౌడీ జనార్ధన' మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ టీజర్ కోసం స్పెషల్ షూటింగ్ చేయనున్నారట. ఈ నెల 7 నుంచి ఈ నెల 10 వరకు ఈ చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం చెన్నై నుంచి ఫైట్ మాస్టర్ సుప్రీం సుందర్ రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు.