ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

రాజస్థాన్‌లో జాతీయ రహదారి రక్తమోడింది. రతన్‌పురా క్రషర్ సమీపంలోని దౌసా-మనోహర్‌పూర్ NH-148పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రక్‌ను కారు ఢీ కొట్టడంతో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.