'ఎన్నికల ప్రచారాలలో పాల్గొనవద్దు'
SRCL: ఉపాధి హామీ సిబ్బంది ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎటువంటి ఎన్నికల ప్రచారాలలో పాల్గొనవద్దని తంగళ్ళపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణ అన్నారు. తంగళ్ళపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరు పాటించాలని స్పష్టం చేశారు.