వేగవరం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం వైపు నుంచి వెళ్తున్న అంబులెన్స్, ఎదురుగా మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతి చెందిన వ్యక్తి జంగారెడ్డిగూడెం పట్టణ వాసి పోలీసులు గుర్తించారు.