29.500 కేజీల గంజాయి పట్టివేత

29.500 కేజీల గంజాయి పట్టివేత

BDK: ఒరిస్సా మల్కాన్ గిరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు కారులో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం మేరకు భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు చెక్‌పోస్ట్ వద్ద నేడు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానం వచ్చినటువంటి కారును నిలిపి పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. బయటకు తీసి తూకం వేయగా 29.500 కేజీలు ఉన్నట్లు ఎస్సై రహీం ఉన్నిసా బేగం తెలిపారు.