'అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానం'

'అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానం'

MHBD: కురవి మండల కేంద్రంలో ఆదివారం శ్రీరామోజు నాగరాజు అధ్యక్షతన బీజేపీ మండల అధ్యక్ష ఎన్నిక కోసం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ మండల ఇంఛార్జి శ్యామ్ సుందర్ శర్మ హాజరై మాట్లాడుతూ.. మండల అధ్యక్ష పదవికి ఐదుగురు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. త్వరలోనే నూతన అధ్యక్షున్ని ఎన్నుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.