నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ATP: గుంతకల్లు ఆలూరు రోడ్డులోని సబ్ స్టేషన్ D2 సెక్షన్ పరిధిలో 11 కేవీ లైన్ నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఏడిఈ నాగేంద్ర, ఏఈ రఘునాథ్ ఆదివారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు టీబీ రోడ్, భాగ్యనగర్, పీఎన్టీ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.