VIDEO: 'రోడ్డుపై పశువులు వదిలితే చర్యలు'
ASR: రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై పశువులను విచ్చలవిడిగా వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గౌరీ శంకర్ హెచ్చరించారు. రాజవొమ్మంగి మండల పరిధిలో గేదెలు రోడ్డుపైకి రావడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు నివారించేందుకు రోడ్డుపై తిరిగే పశువులను గోశాలలకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు.