ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన సర్పంచ్

SKLM: సంతబొమ్మాలి మండలం వడ్డీతాండ్ర పంచాయతీ పరిధిలో గౌరవ సర్పంచ్ అట్టాడ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసాను పంపిణీ చేశారు. కొత్తగా విడుదలైన స్పౌజ్ పెన్షన్స్ లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అరటికట్ల కాంతమ్మకు మరియు అనంత్ మోహానికి సర్పంచ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.