విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

అన్నమయ్య: రాజంపేటలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు నేడు అంతరాయం ఉంటుందని ఆ శాఖ DE సురేంద్రనాథ్ తెలిపారు. రాజంపేట మండలంలోని ఆకేపాడు,కట్ట కిందపల్లె,H చెర్లోపల్లి, నందలూరు మండలంలోని పాటూరు, పుల్లంపేట మండలంలోని SR పాలెం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్లు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఉదయం 10.30 గం నుంచి సాయంత్రం 4 గం వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు.