తహశీల్దార్‌పై వేటు

BHPL: పలిమెల మండల MROపై వేటుపడింది. పలిమెల తహశీల్దార్ సయ్యద్ సర్వర్ 102 ఎకరాల భూమి డెక్కన్ సిమెంట్ రిజిస్ట్రేషన్ చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారని ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ విచారణ చేపట్టి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు నివేదిక అందించారు. ఆక్రమణలు నిజమని తేలడంతో కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేశారు.