ఎస్సీ, ఎస్టీ దాడులపై తక్షణ స్పందన అవసరం: కలెక్టర్
BPT: ఎస్సీ, ఎస్టీలపై దాడులు, నేరాలు జరిగితే యంత్రాంగం వెంటనే స్పందించి న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం జిల్లా స్థాయి పర్యవేక్షణ, నిఘా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడులు జరిగితే బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో ఆలస్యం చేయరాదని అధికారులకు సూచించారు.