లక్ష్మీనారాయణ హత్య సంఘటనను పరిశీలించిన జిల్లా ఎస్పీ

KRNL: కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ లక్ష్మీనారాయణ ఆదివారం దారుణంగా హత్యకు గురయ్యారు. గుంతకల్లు నుండి స్వగ్రామమైన చిప్పగిరి వెళ్ళే దారిలో చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని దుండగులు టిప్పర్‌తో కారును ఢీకొట్టి లక్ష్మీనారాయణను హత్య చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.