VIDEO: రేపు సోమలలో శ్రీరామనవమి ఉత్సవాలు
CTR: సోమలలోని శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో రేపు శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గురువారం పేర్కొన్నారు. ఇప్పటికే ఆలయాన్ని వివిధ రంగుల విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. ఉదయం 7:30 గంటలకు గణపతి పూజ, స్వస్తివాచనం, నవగ్రహపూజ, ధన్వంతరి ఆరాధన హోమాలు,10 గంటలకు కుంభాభిషేకం, సాయంత్రం పుష్ప పల్లకి సేవ జరుగుతుందని తెలిపారు.