నిమజ్జన స్ధలం పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్

SRPT: వినాయక నిమజ్జనానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు కోదాడ మునిసిపల్ పాలక వర్గం చేస్తున్నట్లు ఛైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు. మంగళవారం కోదాడ పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న నిమజ్జన స్థలాన్ని ఆమె పరిశీలించారు. భక్తులు స్నానాలు ఆచరించడానికి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.