'నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి'
ప్రకాశం: ప్రతి ఎస్సై తమ పరిధిలో నేరాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కొండేపి సీఐ సోమశేఖర్ సూచించారు. శుక్రవారం కొండేపిలోని తమ కార్యాలయంలో ఎస్సైలతో ప్రజల భద్రత కోసం చేపడుతున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ప్రజలతో మమేకమై పోలీస్ సేవలను సమర్థవంతంగా అందించాలని, రాత్రి పహారాలు, పర్యవేక్షణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ నేరాలపై పట్టు సాధించాలన్నారు.