చపాట మిర్చికి GI ట్యాగ్.. ప్రత్యేకత ఏంటంటే..!
BHPL: వరంగల్ చపాట మిర్చి జిల్లాలో పండే ప్రత్యేక మిరప రకం. ఇది టమాటా ఆకారంలో, ముదురు ఎరుపు రంగుతో, తక్కువ కారం (4000-6000 SHU) కలిగి ఉంటుంది. ఈ మిర్చికి 2025లో GI ట్యాగ్ లభించడంతో దేశీయ, విదేశీ మార్కెట్లలో ప్రాధాన్యం పెరుగుతోంది. పచ్చళ్లు, కిమ్చి సాస్‌లు, సహజ రంగుల తయారీలో ఉపయోగిస్తారు. నాగిరెడ్డి, తిమ్మాంపేటల్లో దీన్ని శతాబ్దంగా సాగు చేస్తూ మంచి లాభాలను సాధిస్తున్నారు.