జిల్లాలో వీడిన ఉత్కంఠ
VKB: వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ వీడింది. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నచోట పోటీకి సిద్ధమవుతుండగా, లేనిచోట అనుచరులను బరిలో నిలిపి స్థానికంగా పట్టు నిలుపుకోవాలని నాయకులు భావిస్తున్నారు. మొత్తం 594 జీపీలు ఉండగా మహిళలకు 278, బీసీలకు 107, ఎస్సీలకు 111, ఎస్టీలకు 119 స్థానాలు కేటాయించారు.