జిల్లాకు 2,13,000 ఆల్బెండజోల్ టాబ్లెట్‌లు

PPM: జిల్లాకు మొత్తం 2,13,000 ఆల్బెండజోల్ మాత్రలు సరఫరా చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 1,96,612 మంది అంగన్వాడీ, పాఠశాల, కళాశాల పిల్లలు, విద్యార్థుల లక్ష్యంగా ఆల్బెండజోల్ 400మి.గ్రా. మాత్రలు వేయించనున్నామమన్నారు. ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేస్తమని పేర్కొన్నారు.