మంగళగిరిలో టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజ
NTR: మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో టీమిండియా విజయం సాధించాలని తెలుగు మహిళలు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మి పాల్గొన్నారు. మంత్రి లోకేష్ సూచనల మేరకు ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు.