ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి డోలా

ప్రకాశం: టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అయన క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు ముందుంటానన్నారు. కొన్ని సమస్యలకు అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.