చెరువు మాదారంలో నేడు విద్యుత్ అంతరాయం
KMM: సోలార్ పనుల కారణంగా నేలకొండపల్లి మండల పరిధిలోని చెరువు మాదారం గ్రామంలో బుధవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుందని ఏఈ రవి తెలిపారు. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ వినియోగదారులు ఈ సమయాన్ని గమనించి, పనుల నిర్వహణలో విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.