చార్జీల పెంపుపై నగరవాసుల ఆగ్రహం

చార్జీల పెంపుపై నగరవాసుల ఆగ్రహం

HYD: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావించిన తెలంగాణ ఆర్టీసీ చార్జీల పెంపుకు తెరలేపింది. షాద్ నగర్-హైదరాబాద్ మధ్య ఏకంగా రూ.30లను పెంచారు. సాధారణ రోజుల్లో 80 రూపాయలు ఉండగా... పండుగ రోజు ఏకంగా 30 రూపాయలు పెంచడాన్ని ప్రయాణికులు తప్పుపడుతున్నారు. ఓవైపు ఉచిత ప్రయాణం అంటూనే మరోవైపు చార్జీలను పెంచడం దేనికి నిదర్శనమని ప్రశ్నిస్తున్నారు.